ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు ధనుష్. ఇప్పుడు అటు తెలుగు, ఇటు తమిళ్ లో పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక వాటిలో తన దర్శకత్వంలోనే వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. ఇక ఈసినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా ఈమధ్యే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రాయన్ అనే టైటిల్ ను ఈసినిమాను ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఈసినిమా నుండి ఇప్పటికే ఎస్ జే సూర్య, సెల్వ రాఘవన్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈసినిమాలో నటిస్తున్న మరో కీలకపాత్రకు
సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ప్రకాష్ రాజ్ కూడా ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన పోస్టర్ ను తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు ధనుష్.
What a pleasure @prakashraaj sir 🤗♥️ pic.twitter.com/7ZzoVeEntk
— Dhanush (@dhanushkraja) February 23, 2024
కాగా ఈసినిమాలో ఇంకా అపర్ణా బాలమురళి, ధుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ డీవోపీగా అలానే యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: