ఇరుముడి నుండి యాాలలో యాాలలో సెకండ్ సింగిల్ రిలీజ్
IRUMUDI second single out now

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’. తాజాగా ఈ సినిమా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ ‘యాాలలో యాాలలో’ పాటను మేకర్స్ విడుదల చేశారు.
ఒక స్వచ్ఛమైన ‘ఇంటి అనుభూతిని’ కలిగించేలా రూపొందిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ ట్రాక్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఇందులో తండ్రి -కూతరు మధ్య వున్న అనుబంధాన్ని చక్కగా చూపించారు. విజువల్స్ హైలైట్ గా నిలిచాయి.. తమిళంలో ఈ పాటను 'మనసు తన్నాల' పేరుతో రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, గ్రామీణ నేపథ్యం, శబరిమల యాత్ర మరియు బలమైన కుటుంబ అనుబంధాల చుట్టూ కథ సాగనుంది. మైత్రీ మూవీ మేకర్స్ అ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.







