అన్నపూర్ణ స్టూడియోస్, EPIC స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘పళ్ళ బురుసు’. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని నిర్మాతలు. ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ, సుజాత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న సినిమా విడుదల కానుండగా, తాజాగా కింగ్ నాగార్జున అక్కినేని ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓ తండ్రి తన కొడుకుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. కారణం ఏమిటంటే… తనకు టూత్‌బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు పెట్టడం. ఇంత చిన్న విషయానికి ఫిర్యాదు చేయడమేంటని పోలీసులు సర్ ప్రైజ్ గురవుతారు. కానీ ఆ చిన్న ఫిర్యాదు వెనుక ఒక తండ్రి మనసులో దాగి ఉన్న పెద్ద బాధ ఉందనే విషయం క్రమంగా రివిల్ అవుతుంది.
ట్రైలర్ ముందుకు సాగేకొద్దీ తండ్రి-కొడుకుల మధ్య పెరిగిన భావోద్వేగ, ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితి హృదయాన్ని తాకేలా చూపించారు. ఇదే సమయంలో కథ మరో మలుపు తిరుగుతూ, కథానాయకుడు తన సమాధిని తానే తవ్వుకోవడం మరింత ఆసక్తిని పెంచుతుంది.
నవ్వించే సన్నివేశాలతో పాటు మనసును కదిలించే భావోద్వేగాలను అందంగా మిళితం చేసిన ‘పళ్ళ బురుసు’, కుటుంబ బంధాలు, తల్లిదండ్రులు-పిల్లల మధ్య మారుతున్న అనుబంధాలు, ఒక తండ్రి ఆవేదనను తాకేలా చెప్పబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
సినిమాటోగ్రాఫర్ వినోద్ కె. బంగారి గ్రామీణ నేపథ్యాన్ని సహజత్వంతో అద్భుతంగా ఆవిష్కరించగా, పవన్ సీహెచ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వినోదం, భావోద్వేగాలను ఎలివేట్ చేసింది.
కథలోని ప్రధాన సంఘర్షణను పూర్తిగా బయటపెట్టకుండా, ‘పళ్ళ బురుసు కేసు’ వెనుక అసలు కారణమేంటి? తండ్రి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? అనే ప్రశ్నలను ప్రేక్షకుల్లో రేకెత్తించేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
ట్రైలర్ తో ‘పళ్ళ బురుసు’ వినోదంతో పాటు హృదయాన్ని తాకే భావోద్వేగాలను పంచుతూ, ఆగస్టు 14న ప్రేక్షకులను ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలరించబోతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























