1 బిలియన్ వ్యూస్ దాటిన రామాయణ ట్రైలర్

Ramayana Trailer Crosses the 1 Billion Views Milestone

రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ: పార్ట్ 1′ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రామాయణ’ ట్రైలర్‌కు అరుదైన ఘనత సాధించింది. 1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి భారతీయ సినిమా ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్‌కు సినీ అభిమానులు, విమర్శకులు, సెలబ్రిటీలు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా భారీ స్థాయి విజువల్స్, వరల్డ్ క్లాస్ VFX, భావోద్వేగభరితమైన కథనం, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. భారతదేశపు గొప్ప ఇతిహాసాన్ని అత్యంత గౌరవంతో, ప్రామాణికంగా, భారీ స్థాయిలో తెరపై ఆవిష్కరించారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

ట్రైలర్‌లో మరో ప్రధాన ఆకర్షణ స్టార్ కాస్టింగ్. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ శక్తివంతమైన నటనతో ఆకట్టుకోగా, రావణుడిగా యష్ తన పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. సీతగా సాయి పల్లవి తన హుందాతనం, అమాయకత్వం, భావోద్వేగాలతో ప్రశంసలు అందుకుంటున్నారు. శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ లుక్ కూడా మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఈ స్టార్ కాస్టింగ్ ట్రైలర్‌కు మరో పెద్ద బలంగా మారింది.

సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా ప్రశంసలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి VFX, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, గ్రాండ్ సినిమాటోగ్రఫీ, ఎమోషన్స్‌ను మరింత ఎలివేట్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలిసి ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించాయని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దీంతో ‘రామాయణ: పార్ట్ 1’ పై అంచనాలు మరింత పెరిగాయి.

టెక్నికల్‌గా మాత్రమే కాదు… భారతీయుల అత్యంత పవిత్రమైన ఇతిహాసాన్ని ఎంతో నిజాయితీగా, గౌరవంతో, అత్యున్నత స్థాయిలో తెరకెక్కించారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. భక్తి, భావోద్వేగం, విజువల్ గ్రాండియర్‌ను అద్భుతంగా మేళవించిన ఈ ట్రైలర్ అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పూర్తి సినిమాను థియేటర్లలో చూడాలనే ఆసక్తిని పెంచుతోంది.

1 బిలియన్ వ్యూస్ దాటిన తొలి భారతీయ సినిమా ట్రైలర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిన రామాయణ  సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఇప్పుడు ‘రామాయణ: పార్ట్ 1’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నితేష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డీఎన్‌ఈజీ , యష్కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోనీ పిక్చర్స్ ప్రపంచవ్యాప్తంగా, ధర్మ ప్రొడక్షన్స్ నార్త్ ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాయి. ‘రామాయణ: పార్ట్ 1’ దీపావళి 2026 సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.