భారతీయ చలనచిత్ర రంగాన సరికొత్త చరిత్రను లిఖించేందుకు సిద్ధమవుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ విజువల్ ఎపిక్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ . ‘దంగల్’, ‘చిచోరే’ లాంటి దిగ్గజ చిత్రాలను అందించిన విజనరీ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఆస్కార్ గ్రహీత విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ప్రైమ్ ఫోకస్ మరియు ప్రఖ్యాత ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా మైండ్ బ్లోయింగ్ బడ్జెట్‌తో, అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.సినీ ప్రియులు, అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ డేట్స్‌కు సంబంధించి మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామాయణ – పార్ట్ 1: 2026 నవంబర్ 6న (దీపావళి పండుగ కానుకగా) ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషలతో సహా పలు భారతీయ భాషల్లో అత్యంత గ్రాండ్‌గా విడుదల కానుంది.
రామాయణ – పార్ట్ 2: తొలి భాగం విడుదలైన సరిగ్గా ఏడాదికి, అంటే 2027 దీపావళికి రెండో భాగాన్ని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ధృవీకరించింది.
ఈ ఎపిక్ డ్రామాలో భారతీయ చిత్ర పరిశ్రమలోని అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు:
శ్రీరాముడిగా బాలీవుడ్ సూపర్‌స్టార్ రణ్‌బీర్ కపూర్ ,సీతాదేవిగా సౌత్ లేడీ పవర్‌హౌస్, వర్సటైల్ యాక్ట్రెస్ సాయి పల్లవి,రావణాసురుడిగా కేజియఫ్ ఫేమ్, రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారు.
ఈ సినిమా కోసం హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన టాప్ టెక్నీషియన్లను రంగంలోకి దించారు. డిఎన్జి విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందుతున్న విఎఫ్ఎక్స్, 3D టెక్నాలజీ ప్రేక్షకులకు థియేటర్లలో సరికొత్త అనుభూతిని ఇస్తాయని మేకర్స్ పేర్కొన్నారు. అంతేకాకుండా, గ్లోబల్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ దిగ్గజం సోనీ పిక్చర్స్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్కేల్లో ప్రమోట్ చేస్తున్నారు.
భారతీయ సంస్కృతి, పురాణ ప్రాశస్త్యాన్ని ప్రపంచ వేదికపై సరికొత్త శైలిలో ఆవిష్కరించబోతున్న ఈ చిత్రం భారతీయ చలనచిత్ర రంగానికి మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.రీసెంట్ గా విడుదలైన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























