దళపతి విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది లియో ట్రైలర్ గురించి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. మరోవైపు ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ నుండి రిపోర్డ్ మాత్రం చాలా పాజిటివ్ గా వచ్చినట్టే తెలుస్తుంది. లియో విజయ్ కెరీర్ బెస్ట్ ఫిలిం అవుతుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయితే అదిరిపోయింది. విజయ్ యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ నెక్స్ట్ లవల్ లో ఉన్నాయి. ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరిత పెంచేసింది.
కాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: