తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రగణ్యుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)కు దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు. ఎన్టీఆర్ శత జయంతి యేడాది సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం సోమవారం (ఆగస్టు 28, 2023) రూ.100 స్మారక నాణాన్ని విడుదల చేసిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి రాఘవేంద్ర రావు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు చాలా ఆనందం కలిగించిందన్న ఆయన.. ఇదే విధంగా భారత ప్రభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న బిరుదును కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనికోసం అందరూ పూనుకుని ఎన్టీఆర్‌కు త్వరగా భారతరత్న అవార్డు వచ్చేలా కృషి చేయాలని రాఘవేంద్ర రావు అభిలషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’. సాధారణంగా కళలు, సామాజిక సేవ, సాహిత్యం, సాంస్కృతిక, విద్య, విజ్ఞానశాస్త్రం, పారిశ్రామిక రంగాల్లో విశేష సేవలు అందించిన విశిష్ట వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క గెజిట్‌లో ప్రకటించిన తర్వాతే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లవుతుంది. ఇక భారతరత్న పురస్కార గ్రహీతల జాబితాను రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫారసు చేస్తారు. పురస్కార ప్రదాన సమయంలో గ్రహీతలకు రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువీకరణ పత్రంతో పాటు ఒక మెడల్ బహూకరిస్తారు. అయితే పురస్కార గ్రహీతలు తమ పేర్లను ఎక్కడైనా ఉపయోగించే సమయంలో పేరుకి ముందు కానీ, వెనుక కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ భారతరత్న అని రాయకూడదు.
ఇక భారతరత్న పొందిన గ్రహీతలకు దేశంలోని గౌరవనీయ వ్యక్తుల పరంగా.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్‌లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాని తర్వాత ఏడవ స్థాయి గౌరవం లభిస్తుంది. కాగా ఇప్పటివరకు భారతరత్న అవార్డు అందుకున్న వారి సంఖ్య మొత్తం 48. తమిళనాడుకు చెందిన రాజాజీ (సీ. రాజగోపాలాచారి) 1954లో తొలి భారతరత్న అవార్డు అందుకున్నారు. అలాగే ఈ పురస్కారానికి ఎంపికైన తొలి మహిళగా ఇందిరాగాంధీ నిలిచారు. తద్వారా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు ఈ అవార్డు లభించినట్లయింది. 1971లో ఇందిరాగాంధీ, అంతకుముందు ఆమె తండ్రి, స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1955లో.. తనయుడు రాజీవ్ గాంధీ 1991లో భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: