మెగాఫ్యాన్స్, అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న సమయం రాబోతుంది. మరి కొద్ది గంటల్లో మోస్ట్ అవైటెడ్ బ్రో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేసి సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. మరి ఈ సినిమాపై ఇంత బజ్ రావడానికి.. ఈసినిమా చూడటానికి గల రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ కళ్యాణ్
ఈసినిమా చూడాలనుకోవడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే ఈసినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించడం. మరి పవన్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ కటౌట్ చాలు వేరే ఏ ఇతర ఎలిమెంట్స్ అవసరం లేదు సినిమాకు రావడానికి. దీనికితోడు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తరువాత వస్తున్న సినిమాా కావడంతో ఫ్యాన్స్ హ్యాట్రిక్ కోసం చూస్తున్నారు. ఇక ఈసినిమా అప్ డేట్లకు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి హ్యాట్రిక్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. అంతేకాదు ఈసినిమాలో పవన్ చాలా స్టైలిష్ లుక్ లో కూడా కనిపించబోతున్నాడు.
పవన్-తేజ్ కాంబినేషన్
ఈసినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు. సాయి తేజ్ కు పవన్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. అలాంటి మామతో ఇంత తక్కువ సమయంలోనే సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. మరోవైపు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అలానే సన్నివేశాలు కూడా చూడటానికి చాలా బాగుంది. అందుకే సిల్వర్ స్క్రీన్ పై మామా అల్లుళ్ల సందడిని చూడాలని ఇంట్రెస్టింగ్ ఉన్నారు.
సముద్రఖని
ఈసినిమాకు మరో ప్రధాన ఆకర్షణ సముద్రఖని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటం. ఒకవైపు నటుడిగా తన టాలెంట్ ను చూపిస్తూనే మరోపక్క డైరెక్టర్ గా అవతారం ఎత్తాడు. తమిళ్ లో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన వినోదయ సీతం సినిమాకు ఈసినిమా రీమేక్ గా వస్తుంది. ఇక్కడ కూడా సముద్రఖని దర్శకత్వంలోనే ఈసినిమాా వస్తుంది. అయితే తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా స్క్రిప్ట్ లో కాస్త మార్పులు చేశారు.
కథ
ఈసినిమాపై ఆసక్తి పెరగడానికి మరో ప్రధాన కారణం ఈసినిమా కథ ఇంకా పవన్-తేజ్ ల క్యారెక్టరైజేషన్. ఈ సినిమాలో కూడా మరోసారి పవన్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో కూడా ఇలాంటి పాత్రలో నటించాడు పవన్. గోపాల గోపాల సినిమాలో వెంకీని వెనుకనుండి నడిపించే దేవుడి పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఈసినిమాలో కూడా మరోసారి అలాంటి పాత్రతోనే రాబోతున్నాడు. సాయిధరమ్ తేజ్ ను నడిపించే పాత్రలో కనిపించబోతుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
థమన్
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో థమన్ పేరు ముందుంటుంది. వరుస బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ను అందిస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. ఇక ఈసినిమాకు కూడా థమన్ అందించిన పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. మై డియర్ మార్కండేయ, నెరజానవులే, థీమ ఆఫ్ బ్రో, ఫ్యాన్స్ కోసం స్పెషల్ చేసిన కిల్లి కిల్లి సాంగ్ అన్నీ ఆకట్టుకున్నాయి. అలానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































