యువతను విపరీతంగా ఆకట్టుకుని కల్ట్ క్లాసిక్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ‘ఈఎన్ఈ రిపీట్’. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్, శ్రీనాథ్ మాగంటి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించి మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్‌ను వెల్లడించారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ” ఈఎన్ఈ రిపీట్ అధికారిక ట్రైలర్‌ను నవంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై మంచి హైప్ ఉండగా, రాబోయే ట్రైలర్‌తో ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 19న థియేటర్లలో వినోదాన్ని పంచడానికి గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























