తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. జులై 28వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. జులై 28వ తేదీన తెల్లవారు జామున 12 గంటల 1 నిమిషానికి ఈటీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
The #CaptainMillerTeaser Rage begins at 12:01AM , JULY 28th 🔥🥁
THE D DAY #CaptainMiller 🤗@dhanushkraja @ArunMatheswaran @NimmaShivanna @sundeepkishan @gvprakash @priyankaamohan @saregamasouth pic.twitter.com/MAncriQDvh
— Sathya Jyothi Films (@SathyaJyothi) July 26, 2023
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: