యువ నటుడు అనీష్, అందాల భామ అనశ్వర రాజన్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘ఇట్లు అర్జున’ ట్రైలర్ వచ్చేసింది.మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ ట్రైలర్ ను లాంచ్ చేశారు . మహేష్ ఉప్పాల దర్శకత్వంలో, కింగ్ నాగార్జున సమర్పణలో, దర్శకుడు వెంకీ కుడుముల ఈసినిమాను నిర్మించారు. ఇక ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాటలు రాని మౌనమైన యువకుడు అర్జున్ అనే పాత్రలో హీరో అనీష్ కనిపిస్తుండగా, అతని ప్రేమను పొందే కీర్తి పాత్రలో అనశ్వర రాజన్ నటన ఆకట్టుకుంటుంది. కథనం ప్రకారం అర్జున్ తన మనసులోని భావాలను మాటలతో కాకుండా ఎమోషన్స్ మరియు చర్యల ద్వారా వ్యక్తపరిచే విధానం చాలా కొత్తగా అనిపిస్తుంది. ప్రేమికుల మధ్య ఉండే అందమైన క్షణాలతో పాటు ఊహించని మలుపులు, యాక్షన్ ఎలిమెంట్స్ ట్రైలర్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
అనీష్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్‌ను ఎంతో పరిణతితో పోషించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. థమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ లవ్ అండ్ ఎమోషనల్ రైడ్‌కు మరింత ప్రాణం పోసింది. విజువల్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. ఒక పక్క నవ్వులు పూయించే హాస్యం, మరోపక్క గుండెను హత్తుకునే భావోద్వేగాలతో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులలో సరికొత్త క్యూరియాసిటీని నింపింది. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని ఇస్తుందనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























