మట్కా తో వస్తున్న వరుణ్ తేజ్

varun tej 14th movie title announced

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం తను చేస్తున్న గాండీవధారి అర్జున సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. దీనితో పాటు వరుణ్ తేజ్ ఇంకా టైటిల్ పెట్టని VT13 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఇండియన్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రంగా తెలుగు-హిందీ ద్విభాషల్లో ఈసినిమాను రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టేశాడు. ఈసినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో వస్తున్న 14వ సినిమా. పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. 1960 బ్యాక్ డ్రాప్ తో ఈసినిమాను రూపొందించనున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా నేడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫిక్స్ చేశారు. మట్కా అనే టైటిల్ ను ఫిక్స్ చేసి అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా కీలక పాత్రలో నటిస్తుంది. నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో నిర్మించనున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. జీవి ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.