ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల కొత్త ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా. హీరోల పుట్టిన రోజులకు, స్పెషల్ డేస్ కు, సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.. ఇంకొన్ని సినిమాలు రీ రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇక ఇప్పుడు విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమాా కూడా రీరిలీజ్ అయింది. ఈసినిమాను జూన్ 9వ తేదీన రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ కాబట్టి ఈసినిమాను రీరిలీజ్ అయినా కూడా మళ్లీ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది. నాలుగు రోజుల్లో ఈసినిమా 3.3కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మరి రీరిలీజ్ అయిన తరువాత కూడా ఈసినిమా ఈరేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టుకోవడం గొప్ప విషయమే అని చెప్పొచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో ఇంకా గోమఠం,సాయి సుశాంత్ రెడ్డి,వెంకటేష్ కాకుమాను, సిమ్రాన్ చౌదరి,అనీషా అంబ్రోస్ కీలక పాత్రల్లో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈచిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై సురేష్ బాబు నిర్మించారు. 2018లో ఈసినిమా రిలీజ్ అయి డీసెంట్ హిట్ ను అందుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: