టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటిస్తుండగా అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై ఈసినిమా మంచి ఎక్సెపెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే టీజర్ ను కూడా రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి అయితే పలు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా తను చేసిన ఓ ఫన్నీ రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొద్ది రోజులుగా ఐపీఎల్ మ్యాచ్ ల సందడి నెలకొన్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇంకా గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాలి. అయితే వర్షం కారణంగా మ్యాచ్ కాస్త రద్దయింది. దీంతో క్రికెట్ లవర్స్ అందరూ చాలా డిజప్పాయింట్ అయ్యారు. ఇక నవీన్ కూడా మ్యాచ్ ఆగిపోవడంతో దానిపై స్పందిస్తూ హతవిధీ అనే పాట హుక్ లైన్ తో ఫన్నీ రీల్ చేశాడు. ఇక సందర్భానికి కరెక్ట్ గా సింక్ అవ్వడంతో ఈ రీల్ కాస్త వైరల్ గా మారింది.
#Hathavidi… Enti Idhi.. Match eppudu Modaleyyedi.. 🙇🏻♂️ 🏏
Mr. Polishetty does a reel on the current ongoing #CSKvGT #IPL2023Final situation at the @StarSportsIndia office.#MissShettyMrPolishetty @MsAnushkaShetty @naveenpolishety @filmymahesh @radhanmusic @ramjowrites… pic.twitter.com/7qEpDu4y6a
— UV Creations (@UV_Creations) May 28, 2023
కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ కి నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా రధన్ మ్యూజిక్ ఇస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. మరి ఈసినిమా అనుష్క కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: