యుగపురుషుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు. తెలుగు ఖ్యాతిని ప్రంపచానికి చాటి చెప్పిన మహా ధీరుడు. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కు విదేశాల్లో మన తెలుగు వారివల్ల ఆయనకు అరుదైన గౌరవాలు దక్కుతున్నాయి. ఇప్పటికే న్యూజెర్సీ లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది. నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగాప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈనేపథ్యంలో మొట్టమొదటిసారిగా న్యూయార్క్ టైం స్క్వేర్ పై అన్న ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ చిత్రమాలికలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని వివిధ క్యారెక్టర్లను, రాజకీయ చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఎన్నారై టీడీపీ – అమెరికా ఆధ్వర్యంలో 200 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పుతో రూపొందించిన ఈ చిత్రమాలిక.. మే 27వ తేదీ అర్ధరాత్రి నుంచి మే 28 అర్ధరాత్రి వరకు 24 గంటల పాటు ప్రతి నాలుగు నిమిషాలకోసారి 15 సెకన్ల పాటు డిస్ ప్లే అయింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ నాయకులు టైంస్క్వేర్ వద్దకు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు సినీ చరిత్రలో నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు వేసిన ముద్ర గురించి చెప్పడం ఆసాధ్యం. తెలుగు సినీ పరిశ్రమ బ్రతికి ఉన్నంతకాలం ఆయన కూడా సజీవంగా ఉన్నట్టే. ఆయన ఏ పాత్ర చేస్తే ఆపాత్ర కోసం ఆయన పుట్టినట్టు చేస్తారు. యావత్ ప్రపంచ చలన చిత్ర రంగంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నెలకొల్పినన్ని రికార్డులు నెలకొల్పటం మరి ఏ ఇతర నటుడికి సాధ్యం కాదు. సాంఘికమైనా, జానపదమైనా, పౌరాణికమైనా.. పాత్ర ఏదైనా ఆయనకు నల్లేరు మీద నడకే. సాంఘిక చిత్రాలు ఎన్టీఆర్ కు నటుడిగా మంచి గుర్తింపునిస్తే.. పౌరాణిక చిత్రాలు మాత్రం ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేశాయి. పురాణాల్లో చెప్పుకునే శ్రీకృష్ణుడు, రాముడు, రావణుడు, దుర్యోదనుడు, కర్ణుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాత్రలు.. ఆ పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తే దేవుడంటే ఇలానే ఉంటాడేమో.. శ్రీకృష్ణుడు, రాముడు ఇలానే ఉంటారేమో అన్నట్టుగా ఉండేవారు. కేవలం సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా విజయ కేతనం ఎగరవేశారు. అన్నా అని ప్రతి తెలుగు వారు పిలుచుకునేలా చేశారు. 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన రికార్డును కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. ప్రాంతీయ పార్టీల బలం ఎలా ఉంటుందో చూపించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: