సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ధర్మాన్’ . లోకనాయకుడు కమల్ హాసన్ సమర్పణలో ఆయనకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో డ్యాన్సింగ్ సెన్సేషన్, అందాల భామ శ్రీలీల కీలక పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “షి ఈజ్ గాట్ ది స్పార్క్.. షి ఈజ్ గాట్ ది పటాక” అంటూ ఆమెకు సాదరంగా ఆహ్వానం పలుకుతూ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రంలో నయనతార, సిమ్రాన్, రాశి ఖన్నా, యోగి బాబు వంటి ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంలో రామ్ కూడా భాగమయ్యారని వార్తలు వస్తున్నప్పటికీ, దానిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























