వీరసింహారెడ్డి 100 రోజుల సెలబ్రేషన్స్

balakrishna veera simha reddy movie 100 days celebrations

ఈ ఏడాది సంక్రాంతికి పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. అందులో నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా కూడా ఒకటి. పొంగల్ రేసులో దిగిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈసినిమాలో వీరసింహారెడ్డి, జయసింహారెడ్డి అనే రెండుపాత్రల్లో నటించి ఈసినిమాకే హైలెట్ గా నిలిచారు బాలకృష్ణ. ఫ్యాక్షన్ తో పాటు సెంటిమెంట్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కించడంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. బాలకృష్ణ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా 100 రోజుల సెలబ్రేషన్స్ జరపనున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు. జనవరి 12వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. మరో రెండు మూడు రోజుల్లో 100 రోజులను పూర్తిచేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా 100 డేస్ సెలబ్రేషన్స్ ను ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అయితే వేదిక ఎక్కడ అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ఈవెంట్ కు చిత్ర బృందం అంతా హాజరుకాబోతుంది. ఈ రోజుల్లో సినిమా వందరోజులు ఆడటం అరుదైన విషయం. ఈ అరుదైన రికార్డ్ ని ‘వీరసింహారెడ్డి’ అందుకుంది.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇంకా దునియా విజయ్, మంజువారియర్, హనీ రోజ్, ఈశ్వరీరావు, నవీన్ చంద్ర, అన్నపూర్ణమ్మ, బ్రహ్మానందం, అలీ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమా మైత్రీ మూవీ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించారు. ఈసినిమాకు థమన్ సంగీతం, రిషి పంజాబీ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − four =