టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్ . తన నటనతో, అందంతో, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా పలువురు స్టార్ హీరోలతో నటించింది. అయితే హీరోయిన్ గా ఫుల్ బిజీగా ఉండగానే వివాహా బంధంలోకి అడుగుపెట్టింది. గౌతమ్ కిచ్లూతో కాజల్ అగర్వాల్ వివాహం అక్టోబర్ 30, 2020లో జరిగింది. ప్రస్తుతం అయితే కాజల్ పలు సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది. అందులో ఘోస్టీ సినిమా కూడా ఒకటి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ హీరోగా వస్తున్న సినిమా ఘోస్టీ. కామెడీ హార్రర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. అంతేకాదు ఈసినిమాలో కాజల్ ద్విపాత్రాభినయం చేస్తుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టారు కూడా. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా.. అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ అప్ డేట్ వచ్చింది. ఈసినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. తెలుగు వెర్షన్ ను ఉగాది పండుగ రోజున అంటే మార్చి 22వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
కాగా ఈసినిమాలో రాధిక, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. యోగి బాబు, కె ఎస్ రవికుమార్, ఊర్వశి కూడా పలు పాత్రల్లో నటిస్తున్నారు. సీడ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మస్తున్న ఈసినిమాను తెలుగులో గంగ ఎంటర్ టైన్ మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. సామ్ సి ఎస్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: