శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం లో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీ ధర్, విజయలక్ష్మి, మొగిలి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి భీమ్స్ సంగీతం అందించారు. ఈ మూవీ లో నటించిన నటీ నటులు తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బలగం సినిమా టీంకు ఘనంగా సన్మానం జరిగింది. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా ఖచ్చితంగా జనాదరణ పొందుతుందని తనకు నమ్మకం ఎప్పటి నుంచో ఉందనీ , ఒకానొక సమయంలో ఓటిటి కి ఇద్దామని అనుకున్నప్పటికీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించామనీ , ఈ సినిమా ను థియేటర్లలోనే చూసే ఫీలింగ్ వేరనీ , తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింభించే సినిమా ఇదనీ , నటీనటులు అందరూ అద్భుతంగా నటించారనీ చెప్పారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ…54 సంవత్సరాల క్రితం ఏర్పడిన ప్రఖ్యాత సంస్థ అయిన ఈ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌కు నేను రెండోసారి అధ్యక్షుడిగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నాననీ , గతంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు ఈ అసోసియేషన్ అభినందన సభలు ఏర్పాటు చేయడం ఒక రిపోర్టర్‌గా తాను చూశాననీ , .బలగం సినిమా విషయానికి వస్తే.. మంచి కంటెంట్.. కంటతడి ఉన్న సినిమాఅనీ , . మొట్ట మొదటి సారిగా దిల్‌రాజు గారు ఆయన పేరుతో దిల్‌రాజు ప్రొడక్షన్స్ అనే ఒక బ్యానర్‌ను స్థాపించి.. అంతా కొత్త వారితో సినిమా చేస్తున్నారు అంటే.. ఏదో విషయం లేకుండా చేయరు అనుకున్నాననీ , ఈ సినిమా విజయం తనఅంచనాను నిజం చేసిందనీ , తెలుగు సినిమా పరిశ్రమకు దిల్‌రాజు గారు ఒక బలం.. ఆయన వెనుక ఎంతో బలగం ఉందనీ , ఈ బ్యానర్‌లో ఇలాంటి మంచి సినిమాలు సంవత్సరానికి ఒకటన్నా తీయాలని కోరుకుంటున్నాననీ , యూనిట్ అందరికీ మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నామనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: