బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న #NTR30 మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సీరిల్ నేతృత్వం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీకై సెట్స్ రూపొందుతున్నాయి. ఈ మూవీతో పాటు #NTR 31 మూవీకి కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ కె.జి.యఫ్ 1, కె.జి.యఫ్ 2 మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #NTR 31 మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీని డిసెంబర్ లో స్టార్ట్ చేసి.. 2024 ఎండింగ్ లో సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనీ.. ఈ సినిమాని తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా అనేసరికి నేషనల్ రేంజ్ లో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి, ప్రశాంత్ నీల్ విజువల్స్ తోడు అయితే.. మరో వండర్ ఫుల్ సినిమా అయ్యే అవకాశం ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: