వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సీతారామం మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. విడుదలైన వారంలోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఈ మూవీ లాభాల బాట పట్టింది.సెప్టెంబర్ 2న సీతా రామం హిందీవెర్షన్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ శుక్రవారం (ఆగస్ట్ 26) సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. తెలుగు బ్లాక్‌బస్టర్ సీతా రామం సెప్టెంబర్ 2 నుంచి హిందీలోనూ మిమ్మల్ని మెస్మరైజ్ చేయబోతోంది అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: