శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 ” మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1200 ఫైటర్స్ తో హీరో రామ్ చరణ్ పాల్గొనే యాక్షన్ సీన్ , 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్ లతో రామ్ చరణ్ , కియారా అద్వానీ పాల్గొనే సాంగ్ #RC15” మూవీకి హైలైట్ కానున్నాయి. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. చరణ్ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కై కియారా హైదరాబాద్ చేరుకున్నారు. రామ్ చరణ్ , కియారా ల కాంబినేషన్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ రోజు నుంచి 15 రోజుల పాటు చిత్రీకరించనున్నట్టు , ఈ షెడ్యూల్ తో #RC15” మూవీ 60 శాతం చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: