‘పొన్నియన్ సెల్వన్’ త్రిష ఫస్ట్ లుక్ రిలీజ్..!

Trisha First Look Poster Released From Ponniyin Selvan Movie,Trisha’s Character Poster Revealed From Mani Ratnam’s Ponniyin Selvan,The Character Looks Of Vikram,Karthi,And Aishwarya Rai From Mani Ratnam’s Ponniyin Selvan Are Out Now,Aishwarya Rai look from Ponniyan Selvan Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Trisha,Actress Trisha,Trisha in Ponniyan Selvan,Trisha Movie Updates,Trisha latest Movie Updates,Trisha Upcoming Movies,Trisha New Movie Updates, Ponniyan Selvan,Ponniyan Selvan Movie,Ponniyan Selvan Telugu Movie,Ponniyan Selvan Latest Telugu Movie,Trisha and Vikram Ponniyan Selvan,Trisha and Vikram, Vikram Ponniyan Selvan Movie Updates,Ponniyan Selvan latest Movie,Ponniyan Selvan Upcoming Movie

మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పొన్నియన్ సెల్వన్. ఈసినిమా చోళరాజుల కాలానికి సంబంధించిన నేపథ్యంలో.. ఒక సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుండగా.. మరోపక్క ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం వ‌రుస‌గా అప్‌డేట్‌లను ఇస్తుంది. ప్ర‌తిరోజు ఈసినిమాలో నటించిన న‌టీన‌టుల పోస్ట‌ర్‌ల‌ను విడుద‌ల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే విక్రమ్, జయం రవి, కార్తీ లుక్‌లు విడుదలవ్వగా.. నిన్న ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్రంలోని త్రిష ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో త్రిష కుంద‌వాయి పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మణిరత్నం ఈసినిమాను విజువల్ వండర్‌గా.. భారీ క్యాస్ట్‌తో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా అందులో మొదటి పార్ట్ సెప్టెంబర్ 30 తేదీన రిలీజ్ చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది.

ఇంకా ఈసినిమాలో ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చుతున్నారు. మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై మణిరత్నం, సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.