‘కె.జి.యఫ్ 2’ సక్సెస్ సెలబ్రేట్ చేస్తున్న ప్రభాస్-ఎన్టీఆర్ ఫ్యాన్స్..!

Prabhas Ands NTR Fans Celebrate KGF 2 Movie Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas And Jr NTR,Pan India Stars Prabhas And Jr NTR,Prabhas And Jr NTR Fans Celebrate Success of Prashanth Neel KGF Chapter 2,Fans Celebrate The Success Of Prashanth Neel’s KGF Chapter 2, Prashanth Neel’s KGF Chapter 2,Prashanth Neel’s KGF Chapter 2,Yash KGF Chapter 2 Movie Blockbuster Hit,Prabhas And Jr NTR Fans Celebrations for KGF2 Success,KGF Chpater 2 Celebrations

కె.జి.యఫ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. ఈసినిమాతో కన్నడ సినీ చరిత్రలో కొత్త రికార్డులను సృష్టించాడు. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా కన్నడలోనే కాదు తెలుగు, తమిళ్ ఇంకా నార్త్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది. ఇక ఇప్పుడు కె.జి.యఫ్ 2 ను కూడా తీసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మరి ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తున్నాం. అంచనాలను మించేలా సినిమా ఉండ‌టంతో ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఇక కలెక్షన్స్ గురిచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ‌స్ట్ డే వ‌రల్డ్ వైడ్‌గా రూ.135 కోట్లు గ్రాస్ వ‌సూళ్లను సాధించినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సక్సెస్ ను అటు ప్రభాస్ ఫ్యాన్స్ అలానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ ఇంకా ఎన్టీఆర్ కూడా సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ కె.జి.యఫ్ 2 సక్సెస్ సెలబ్రేషన్స్ ను చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ తో సలార్ సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు ప్రశాంత్ నీల్. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమాను ఇప్పటికే ప్రకటించినా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా టైమ్ పడుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ – మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 2 =