ప్రస్తుతం దక్షిణాది మూవీస్ బాలీవుడ్ లో స్ట్రెయిట్ మూవీస్ దాటుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు బాలీవుడ్ మూవీస్ ను దక్షిణాది భాషలలో రీమేక్ చేసేవారు. ఇప్పుడు సౌత్ మూవీస్ ను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాత , దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. “బాహుబలి “, “కె జి ఎఫ్ 1 “, “సాహో”, పుష్ప :ది రైజ్ “, “ఆర్ ఆర్ ఆర్ “వంటి మూవీస్ బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ ను రాబడుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఇంటర్ వ్యూ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. సౌత్ లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలను రూపొందిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారని సౌత్ ఇండస్ట్రీ పై ప్రశంసలు కురిపించారు. కానీ బాలీవుడ్ సినిమాలు సౌత్ లో ఎందుకు సరిగ్గా ఆడడం లేదో తనకు అర్ధం కావడం లేదనీ , బాలీవుడ్ లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు రావాలనీ , అటువంటి సినిమాలను తీయాలనీ చెప్పారు. తెలుగు , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను తెరకెక్కించిన ఆర్ జి వి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. సౌత్ డైరెక్టర్స్ మాస్ ఆడియెన్స్ ను అలరించేలా సీటీ మార్ డైలాగ్స్ తో మూవీస్ తెరకెక్కించి విజయాలను సాధిస్తున్నారనీ , బాలీవుడ్ లో మంచి రైటర్స్ ,డైరెక్టర్స్ ఉన్నా , మాస్ ఆడియెన్స్ పరిధి తక్కువగా ఉండడంతో సౌత్ మూవీస్ కు పోటీ ఇవ్వలేకపోతున్నారనీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: