క్లాసికల్ డ్యాన్సర్ , మోడల్ లావణ్య త్రిపాఠి సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయమయ్యి తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“దూసుకెళ్తా “, “మనం “, “భలే భలే మగాడివోయ్ “, “సోగ్గాడే చిన్ని నాయనా “, “అర్జున్ సురవరం “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో లావణ్య ప్రేక్షకులను అలరించారు. రెండు తమిళ మూవీస్ లో కథానాయికగా నటించిన లావణ్య త్రిపాఠి మరో తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న లావణ్య పలు ఫోటోషూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తన వర్కౌట్ వీడియోస్ ను లావణ్య సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే లావణ్య ప్రస్తుతం కొత్త కథలు వింటూ విరామాన్ని ఆస్వాదిస్తున్నారు. అభిమానులతో లావణ్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సరదాగా ముచ్చటించారు. కాంక్రీట్ జంగిల్‌కు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ వృత్తిపరమైన ఒత్తిడుల నుంచి సాంత్వన పొందుతాననీ , మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే లైఫ్‌సైకిల్ సక్రమంగా సాగుతుందనీ , తనకు ట్రిపోఫోబియా ఉందనీ , కొన్ని ఆకారాల్ని, వస్తువుల్ని చూడగానే తెలియకుండానే భయపడతాననీ , ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాననీ , .ఈ ఏడాది నేను నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయనీ , అందుకే కెరీర్‌కు స్వల్ప విరామం తీసుకోవాలని అనుకున్నాననీ చెప్పారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: