నారప్ప పై చిరు ప్రశంసలు.. వెంకీ కనిపించలేదు

Megastar Chiranjeevi Showers Applauds On Victory Venkatesh For His Performance In Narappa Movie

తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో వెంకీ ప్రధాన పాత్రలో నారప్పగా వచ్చిన సంగతి తెలిసిందే కదా. శ్రీకాంత్ అడ్డాల ఈసినిమాకు దర్శకత్వం వహించాడు. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 20న  రిలీజ్ అయింది. ఇక వెంకీ తన కెరీర్ లో ఎప్పుడు చేయని పాత్రలో చేయడంతో వెంకీ నటనను చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో మెగాస్టార్ చిరు కూడా వెంకీ పై ప్రశంసలు కురిపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా నారప్ప సినిమా చూశాను.. ‘నారప్ప’ పాత్రలో వెంకటేష్ నటించలేదని.. ఆయన జీవించాడని.. సినిమా మొత్తంలో వెంకటేష్ కనిపించలేదు.. నారప్పనే కనిపించాడని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇక దీనికి వెంకీ కూడా స్పందించి చిరంజీవి నుండి ప్రశంసలు అందుకున్నందుకు థ్యాంక్స్ చెప్పారు.

కాగా సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పించిన ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా ప్రియమణి నటించింది. రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.