గత ఏడాది ‘ఆకాశం నీహద్దురా’ సినిమాతో అలరించిన తమిళ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తున్న ‘వాడి వాసల్’ ఒకటి కాగా రెండోది పాండిరాజ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఇక నేడు సూర్య పుట్టిన రోజు కావడంతో వరుసగా తన సినిమాల నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న 40వ చిత్రం టైటిల్ ను నిన్ననే చిత్ర బృందం ప్రకటించింది. ఈసినిమాకు‘ఎదర్కుం తనిందవన్’ అనే పేరు పెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సూర్య 39 నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ‘జై భీమ్’ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ పోస్టర్ లో సూర్య లాయర్ క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు. పోస్టర్ని బట్టి పవర్ఫుల్ లాయర్‌గా ఆయన కనిపించనున్నారని అర్థమవుతోంది. 2 డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
Excited to share the First Look of #JaiBhim #ஜெய்பீம்@prakashraaj @tjgnan @RSeanRoland @srkathiir @KKadhirr_artdir @philoedit @anbariv @rajisha_vijayan #Manikandan #LijoMolJose @joshikamaya @PoornimaRamasw1 @thanga18 @kabilanchelliah @proyuvraaj @rajsekarpandian @2D_ENTPVTLTD pic.twitter.com/acDoYuir2K
— Suriya Sivakumar (@Suriya_offl) July 23, 2021
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























