తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఓటీటీలో ఈసినిమా రిలీజ్ అవుతున్న సంగతి కూడా తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 20న ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా నారప్ప ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ‘నారప్ప’గా వెంకటేష్ నటన ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ వెంకటేష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
His silence is the calm before the storm….here is our #Narappa!
Trailer out now: https://t.co/3jUT5nCJbp
Meet #NarappaOnPrime, July 20. @PrimeVideoIN@VenkyMama #Priyamani @KarthikRathnam3 #SrikanthAddala #ManiSharma @theVcreations pic.twitter.com/KbwcN6gK18
— Suresh Productions (@SureshProdns) July 14, 2021
కాగా ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్ రత్నం కూడా నటించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించారు. మరి తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈసినిమా తెలుగులో ఎంత వరకూ హిట్ అవుతుందో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: