మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ స్పెషలిస్ట్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఇరుముడి’. టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్ అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా అసలు కథాంశాన్ని, అందులోని భావోద్వేగ బంధాన్ని పరిచయం చేస్తూ ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్‌ను జూన్ 3 న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
“ది రిలేషన్షిప్ దట్ డిఫైన్స్ ద ఫిలిం” అనే ట్యాగ్‌లైన్‌తో మేకర్స్ ఈ అప్‌డేట్ ఇచ్చారు. దీనిబట్టి ‘ఇరుముడి’ కేవలం ఒక ఆధ్యాత్మిక నేపథ్యమే కాకుండా, శివ నిర్వాణ మార్క్ హృదయానికి హత్తుకునే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా మరియు తండ్రి-కూతురు లేదా ఒక అద్భుతమైన రిలేషన్ చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ స్టోరీగా ఉండబోతుందని స్పష్టమవుతోంది.
ఈ సినిమాలో రవితేజ సరసన టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్) హీరోయిన్‌గా నటిస్తోంది.కీలక పాత్రల్లో సాయి కుమార్ చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నక్షత్ర ఈ చిత్రంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తున్నారు.
వర్సటైల్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శివ నిర్వాణ సినిమాల్లోని పాటలకు, మ్యూజిక్‌కు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది, దానికి తోడు జీవీ ప్రకాష్ తోడవ్వడంతో ఆల్బమ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























