మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ . జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో.. నిన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానుల కోలాహలంతో ఈ ఈవెంట్ థియేటర్లలోకి రాకముందే సక్సెస్ మీట్‌ను తలపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వెంట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ విజయవాడతో తన కుటుంబానికి ఉన్న సెంటిమెంట్‌ను గుర్తుచేసుకున్నారు. తన తండ్రి మెగాస్టార్ చిరణ్జీవి బ్లాక్‌బస్టర్ సినిమాల సెలబ్రేషన్స్ ఇక్కడే జరిగాయని, అదే సెంటిమెంట్‌ను ‘పెద్ది’తో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.
“నటుడిగా నేను ఎన్నో కథలు వింటాను, కానీ ‘పెద్ది’ నా హృదయాన్ని బలంగా హత్తుకుంది. ఇలాంటి అద్భుతమైన కథలు పరిశ్రమలోకి పదేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. మగధీర, రంగస్థలం, RRR సినిమాల తర్వాత నేను అంతగా ఎగ్జైట్ అయి, ప్రతిరోజూ షూటింగ్‌కు ఎప్పుడు వెళ్దామా అని ఆరాటపడిన సినిమా ఇదే. ఇది కేవలం పైపైకి ఎగిసిపడే వ్యక్తి కథ కాదు.. కిందపడిపోయిన ఒక మనిషి తిరిగి లేచి ఎలా నిలబడ్డాడనే ఇన్‌స్పిరేషనల్ స్టోరీ. నా పర్సనల్ లైబ్రరీలో ఇది ఎప్పటికీ ఒక ఆస్తిలా ఉండిపోతుంది.”
రాసి పెట్టుకోండి.. బుచ్చిబాబు త్వరలోనే ఇండియాలోనే టాప్ 3-4 దర్శకుల్లో ఒకడిగా నిలుస్తాడు. ఇక జాన్వీ కపూర్‌ను చూస్తుంటే నా పక్కన ఒక చందమామ ముక్క వచ్చి కూర్చున్నట్లు ఉంది. శ్రీదేవి గారు ఎక్కడున్నా తన కూతురిని చూసి గర్వపడతారు. జాన్వీ తన తల్లి కంటే పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను.” ఫ్యాన్స్‌కు పవర్‌ఫుల్ ప్రామిస్: “నేను సినిమాలు చేసేదే మీకోసం. మీ కోసం చేతులు విరగొట్టుకోవడమే కాదు.. అవసరమైతే రక్తమైనా చిందిస్తా. చిరంజీవి గారి కొడుకుగా, కళ్యాణ్ బాబాయ్ అబ్బాయిగా నాకు తెలిసిందల్లా సినిమాయే, నా చివరి శ్వాస వరకు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























