మాస్ మహారాజరవితేజ ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక్కడ కొన్ని రోజులు షూటింగ్ ను పూర్తి చేసుకున్న తరువాత దుబాయ్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక ఈసినిమాతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రూపొందుతోన్న విషయం తెలిసిందే..రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాను కూడా రేపటినుండి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈసందర్భంగా రేపు మరో అప్ డేట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ పోస్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు. రేపు ఉదయం 10.8 నిమిషాలకు అప్ డేట్ ఇస్తున్నాం అని ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఎస్ఎల్‌వి సినిమాస్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇక ఈసినిమాకు ఎక్కువ టైమ్ తీసుకోకుండా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని చూస్తున్నారట.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: