ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో పూర్తికానుంది. ఇక ఈసినిమా తరువాత చిరంజీవి లూసిఫర్ సినిమాను చేయనున్న సంగతి కూడా విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంకా వీటితో పాటు చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈనేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందట. ఇప్పటికే ఈసినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ సోనాక్షీ సిన్హా నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీను తీసుకోవాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నవాజుద్దీన్ సిద్దిఖీని మేకర్స్ సంప్రదించారని.. చిరంజీవి సినిమా కావడంతో ఈ సినిమాలో విలన్ గా నటించేందుకు నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా అంగీకరించారని అంటున్నారు. చూద్దాం మరి దీనిపై అధికారిక ప్రకటన వస్తుందేమో.
ఇక ఆచార్య సినిమా అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ ను చేయనున్నాడు. ఈ సినిమా తరువాత మెహర్ రమేష్ తో ఆ తరువాత బాబితో సినిమాలు చేయనున్నాడు. మరి ఒకదాని తరువాత ఒకటి చేస్తాడా పార్లల్ గా రెండు సినిమాలు ఒకేసారి చేస్తాడా అన్నది చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: