టాలీవుడ్ హీరోలందరూ ఒక్కొక్కరుగా షూటింగ్ లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు సినిమా అప్ డేట్ లు కూడా స్టార్ట్ చేశారు. ఇక ప్రస్తుతం శర్వానంద్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆడవాళ్ళు మీకు జోహార్లు అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమా కూడా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనుంది. ఈసినిమాలో రష్మిక మందన్నహీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో కంటే ముందుగానే శర్వా నూతన దర్శకుడు శ్రీకార్తీక్ దర్శకత్వంలో తమిళ్, తెలుగులో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. కరోనా వల్ల పలు బ్రేక్ లు రాగా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. ఇక ఈ రోజు ఫస్ట్‌లుక్ పోస్టర్ ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ఒకే ఒక లోకం అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.
Presenting the first look of #Sharwa30 #OkeOkaJeevitham 💖#ఒకేఒకజీవితం 💖@riturv @amalaakkineni1 @vennelakishore @priyadarshi_i @twittshrees @JxBe @sujithsarang @sreejithsarang @anilandbhanu #OOJ pic.twitter.com/13KRHnkdTt
— Sharwanand (@ImSharwanand) June 28, 2021
కాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి లతో పాటు.. ఈ సినిమాలో అక్కినేని అమల ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: