గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే నైజాం (తెలంగాణ) ఏరియాలో ఈ సినిమా బిజినెస్ రేంజ్ పరంగా ఒక ఊహించని షాక్ తగిలింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా టికెట్ ధరల పెంపుతో పాటు ఐదు షోలు, ప్రీమియర్లకు అనుమతి లభించగా.. తెలంగాణలో మాత్రం ‘పెద్ది’ చిత్రానికి ఎలాంటి టికెట్ ధరల పెంపు ఉండటం లేదు.
సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన నేపథ్యంలో మొదటి వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలంగాణ హోమ్ సెక్రటరీకి రెండు సార్లు వినతి పత్రాలు సమర్పించింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, మేకర్స్ అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
కానీ, గతంలో సినిమా టికెట్ల నియంత్రణపై ఉన్న కోర్టు నిబంధనలు, పాత తీర్పులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. కోర్టు నుండి సానుకూల స్పందన రాకపోవడంతో, గందరగోళాన్ని నివారించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీనితో నైజాం పరిధిలో ‘పెద్ది’ పాత సాధారణ ధరలతోనే విడుదల కావడం ఖాయమైంది.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























