విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్, భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు. ‘బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని, దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్ తరువాత విజయ్ ఆంటోని హీరోగా, శశి దర్శకత్వంలో ‘వంద దేవుళ్ళు’ అనే చిత్రం రాబోతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌లో బజ్‌ను పెంచేశాయి. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ మూవీని జూన్ 19న విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ ఎంతో ఇంప్రెస్సివ్‌గా ఉంది. ఈ పోస్టర్లో హీరో, హీరోయిన్ కనిపిస్తున్న తీరు, సైకిల్ మీద సింపుల్‌గా వెళ్తున్న తీరు చూస్తుంటే ఇదొక పీరియాడిక్ డ్రామా అని అర్థం అవుతోంది.
ఫ్యామిలీ, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో ‘వంద దేవుళ్ళు’ సినిమాని రూపొందించారు. ఈ సినిమాకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఇక ఈ మూవీని జూన్ 19న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























