ఈరెండు రోజులు మెగా ఫ్యామిలీ కి పండగే. రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఈరోజు నుండే సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ సందడి చేస్తున్నారు. ఇక అభిమానులకు రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్ కు ఒక రోజు ముందే తను నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. ఇక ఇదిలా ఉండగా మరో రెండు రోజులు మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ లు ఉన్నట్టు తెలుస్తుంది. ఈవిషయం ఎవరో కాదు చరణ్ స్వయంగా అభిమానులతో చెప్పడంతో అభిమానులు సంతోషంలో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈరోజు ఉదయమే అభిమానులు భారీగా చరణ్ నివాసానికి చేరుకున్నారు. తన ఇంటి ముందుఉన్న గేట్ మీద నుంచి అభిమానులతో కొంచం సేపు మాట్లాడాడు చరణ్. ఈరోజు ఆర్ఆర్ఆర్ పోస్టర్ రిలీజ్ కాగా.. రేపు శనివారం రోజున ఆచార్య పోస్టర్ రాబోతుందంటూ.. అలాగే మార్చి 28న పవర్ స్టార్ వకీల్ సాబ్ పోస్టర్ రానుందంటూ సర్ ప్రైజ్ రివీల్ చేశాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: