నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్, టాలెంటెడ్ నటుడు శ్రీ విష్ణు కాంబినేషన్ లో వస్తున్న సినిమా గాలి సంపత్. అనీష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పించడమే కాదు.. స్క్రీన్‌ప్లే కూడా అందించాడు. ఇక మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. చిత్రయూనిట్. ఇక ఈ కార్యక్రమానికి ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని అతిథిగా రాగా.. దిల్ రాజు, శివ నిర్వాణ, గోపిచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ – `నేను సాయి బెస్ట్ ఫ్రెండ్స్. మేం దూరంగా ఉన్నా చాలా దగ్గరగా ఉంటాం. అంత మంచి ఫ్రెండ్‌షిప్ మాది. 2005లో బ్రమరాంబ థియేటర్‌లో అతడు సినిమాలో సాయి నాకు కలిశాడు. నా కష్ట నష్టాల్లో, నా ఆనందంలో అన్నింటిలో సాయి ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే సాయి నా ఫ్యామిలీ మెంబర్. నా సక్సెస్ అన్నింటిలో చాలా కీ రోల్ పోషించాడు అలాంటి సాయి నెక్ట్స్ లెవల్‌కి ఎలా రావాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడూ సాయి నువ్వేం చేసిన నీ వెనుక నేను ఉంటాను అని చెప్పాను. అలాంటి సాయి మంచి కథ రాశాడు, గాలి సంపత్ కథ దీంతో నేను ప్రొడ్యూసర్ అవ్వాలి అనుకున్నాడు. దానిని ముందుకు తీసుకు వెళ్లడానికి మాకు సాహూ గారపాటి, హరీష్ పెద్ది చాలా హెల్ప్ చేశారు. త్వరలో వారితో ఒక మంచి సినిమా చేయబోతున్నాను. గాలి సంపత్ తను చెప్పినట్టు కొత్త కథ. కొత్త ప్రయత్నం. సక్సెస్ పై మేమందరం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అనీష్‌కి ఈ సినిమా తర్వాత మంచి సినిమాలు రావాలి. మంచి టీమ్ కుదిరింది. అందరు టెక్నీషియన్స్ చాలా బాగా వర్క్ చేశారు. గాలి సంపత్ గా రాజేంద్ర ప్రసాద్ ఫిక్స్ అయ్యాక ఆయన కొడుకుగా ఎవరు చేయాలి అని అనుకున్నప్పుడు మాకు శ్రీ విష్ణు తప్ప ఇంకో ఆప్షన్ కూడా కనపడలేదు. విష్ణుకి ఈ సినిమా డెఫినెట్ గా ఒక మంచి సినిమా అవుతుంది. రాజేంద్ర ప్రసాద్ గారితో సుప్రీమ్ నుండి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఎంటర్‌టైన్ మెంట్లో ఆయన్ని కొట్టేవారే లేరు. ఈ సినిమాలో మరో లెవల్‌లో ఎంటర్‌టైన్ చేయబోతున్నాడు. ఆయన కష్టం రేపు స్క్రీన్ మీద చూస్తారు. ఆయన ఒక లెజెండ్. ఎన్నో హాస్య భరిత సినిమాలు చేసి మనల్ని ఎంటర్టైన్ చేసిన ఒక గొప్ప నటుడు ఈ వయసులో ఒక గొప్ప సినిమాలో యాక్ట్ చేశారు. మనల్ని కొన్నేళ్లు నవ్వించిన రాజేంద్ర ప్రసాద్ గారి కోసం నేను నా ఫ్యామిలీతో కలిసి మార్నింగ్ షో సినిమా చూస్తున్నాను, మీరు కూడా సినిమా చూసి ఆయనకి ఒక సెలబ్రేషన్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నా ఐదు సినిమాల జర్నీలో నా వెంట ఉంది ప్రేక్షకులు. ప్రతి సినిమాని మీ కుటుంభంతో వచ్చి ఆదరించారు. ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాను. ఈ సినిమాని కూడా మీరు వచ్చి ఆదరించాలని నా హంబుల్ రిక్వెస్ట్. రామ్ గారితో నా జర్నీ చాలా కాలం నుండి ఉంది. త్వరలో ఆయనతో అద్భుతమైన సినిమా చేయాలనుకుంటున్నాను` అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: