అరుణ్ భీమవరపు దర్శకత్వంలో యంగ్ హీరో ఆశిష్, బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న సినిమా లవ్ మీ. హార్రర్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచేశాయి. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు రీసెంట్ వచ్చిన సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన సినిమాకు పోలికలు ఉన్నాయంటూ రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా ఈ రూమర్లకు క్లారిటీ ఇచ్చాడు హీరో ఆశిష్. ఈసినిమా మే31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆశిష్ ఈ రూమర్లను ఖండించాడు. ఆ సినిమాకు లవ్ మీ సినిమాకు అసలు సంబంధం లేదు.. ఈసినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది.. హార్రర్ ఇంకా థ్రిల్లర్ అంశాలతో కూడిన ప్యూర్ లవ్ స్టారీ.. కొన్ని ఎలిమెంట్స్ ఆడియన్స్ ను సర్ ప్రైజ్ చేస్తాయి అంటూ క్లారిటీ ఇచ్చాడు.
కాగా ఈసినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అలాగే కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























