మనవరాళ్ల సాయంతో చిరు వంట

Mega Star Chiranjeevi Cooks Food Along With His Grand Children

లాక్ డౌన్ లో చిరు ఇంట్లో ఉంటూ బాగానే కాలక్షేపం చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్ స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు త‌న పోస్ట్‌ల‌తో నెటిజ‌న్స్‌కి కావ‌ల‌సినంత వినోదాన్ని అందిస్తున్నారు. ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ని షేర్ చేస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు వంటలు కూడా చేస్తున్నారు. గతంలో తన తల్లికి దోశలు.. చేపల వేపుడు చేసి పెట్టిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలను అభిమానులతో కూడా పంచుకున్నాడు. ఇక ఇప్పుడు మరో వంటకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టాలో పోస్ట్ చేసాడు. అయితే ఈసారి చిరు కాదు తన మనవరాళ్లతో కలిసి వంట చేయించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన మనవరాళ్లు నివ్రితి, సంహితలు ఇద్ద‌రికీ స‌ల‌హాలు ఇస్తూ ద‌గ్గ‌రుండి కెఎఫ్‌సి చికెన్ త‌యారు చేయించాడు. ఇక వీడియోలో నివ్రితి, సంహితలు బోర్‌ కొడుతుంది.. కెఎఫ్‌సి చికెన్‌ తినాలని ఉంది అని సంహిత అనగా.. బయట పరిస్థితులేమీ బాగోలేదు.. ఇంట్లోనే తయారు చేసుకుందాం.. అని చిరు చెప్పారు. ఇంట్లో.. కెఎఫ్‌సి చికెన్‌ ఎవరు చేస్తారు? అనగానే చిరు నేను చేస్తాను.. మీరు నాకు అసిస్టెంట్స్‌గా సహాయం చేస్తే.. అనగా.. ఇద్దరు మనవరాళ్లు.. కెఎఫ్‌సి చికెన్‌ తయారీకి కావాల్సిన వన్నీ రెడీ చేసి ఇచ్చారు. వారి సహాయంతో చిరు వారికి కావాల్సిన కెఎఫ్‌సి చికెన్ త‌యారుచేసి పెట్టాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. మరి మీరు కూడా చిరు చేసిన కెఎఫ్‌సి చికెన్ ను ట్రై చేసి చూడండి.

 

కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =