పెళ్లి తర్వాత పెద్దగా మార్పులేదు

Marriage Didn't Bought Huge Changes In My Life Says Rana Daggubati

2020 లో టాలీవుడ్ సెలెబ్రిటీస్ చాలా మంది పెళ్లి పీటలు ఎక్కారు. నిఖిల్ తో మొదలు పెట్టి, నితిన్, రానా, తాజాగా కాజల్… వరుస పెట్టి ఒక్కొక్కరుగా ఎంతో మంది వివాహమాడారు. ఇక పెళ్లి తర్వాత నా లైఫ్ లో ఎలాంటి మార్పు లేదు అని అంటున్నాడు రానా. రానా-మిహీకా ల వివాహం జరిగి మూడు నెలలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రానా పెళ్లి తర్వాత తన లైఫ్ ఎలా ఉందో చెప్పాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రానా మాట్లాడుతూ ‘సాధారణంగా పెళ్ళికి ముందున్నట్టు పెళ్ళి తర్వాత ఉండదు అని అంటారు. పెళ్ళి తర్వాత జీవితం చాలా మారిపోతుందని చెబుతుంటారు. కానీ పెళ్ళి తర్వాత నా జీవితంలో పెద్దగా మారలేదని, అంతకుముందుకీ, ఇప్పటికీ పెద్దగా మార్పేదీ కనిపించట్లేదని చెప్పుకొచ్చాడు. అయితే మిహీకా బజాజ్ లైఫ్ లోకి వచ్చాక కాస్త బాధ్యత పెరిగిందని.. ఇప్పుడు కాస్త నిలకడగా ఉన్నా.. మిహీక చాలా సరదాగా ఉంటుంది.. తనతో జీవితం చాలా ఆనందంగా ఉందని.. మిగిలిన జీవితం కూడా తనతో గడపడానికి ఎదురుచూస్తున్నా’ అని చెప్పాడు.

ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా విరాటపర్వం 1992 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడు. దీనితో పాటు ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా “హాథీ మేరే సాథీ ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘అరణ్య’, తమిళ్‌లో కదన్ పేరుతో రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 9 =