హీరో నాని రక్తదానం

Natural Star Nani Donates Blood To Thalassemia Patients Amid Lockdown

తలసేమియా పేషేంట్స్ కు బ్లడ్ అవసరం చాలా ఎక్కువ అనే విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని బ్లడ్ బ్యాంక్స్ లో బ్లడ్ స్టాక్ తక్కువగా ఉంది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో బ్లడ్ డొనేట్ చేయడానికి డోనర్స్ జంకుతున్నారు. ఈ సమయంలో హీరో నానితన భార్యతో సహా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ కు వెళ్ళి బ్లడ్ డొనేట్ చేశారు. బ్లడ్ డొనేట్ చేయడానికి భయపడే వారికి ప్రేరణ గా నిలిచిన హీరో నానికి సెల్యూట్ అంటూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ట్వీట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ .. కరోనా వైరస్ కారణంగా ప్రజల పరిస్థితి విషమం గా ఉందని, అందుకే ఇళ్ళకు పరిమితం అయ్యామని, తలసేమియా వ్యాధితో వేల మంది చిన్నారులు బాధపడుతున్నారని, వారికి బ్లడ్ అవసరం ఉందని, వారికే కాకుండా ఆపరేషన్స్ వంటి వాటికీ బ్లడ్ కావాల్సి ఉందని , కరోనా కారణంగా డోనర్స్ బయటకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడానికి భయపడుతున్నారని , కరోనా కు బ్లడ్ డొనేషన్ కు ఎటువంటి సంబంధం లేదని, ఈ సమయంలో రక్త దానం అవసరముందని, మీరు కూడా రక్తదానం చేసి జీవితాలను రక్షించండి అంటూ నాని చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.