పుష్ప2 సెకండ్ సాంగ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్

pushpa 2 second song interesting poster revealed

సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప2 సినిమా కూాడా ఒకటి. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈపార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన పుష్ప సినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు సృష్టించడంతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పార్ట్ 2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు మేకర్స్. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు వీడియోలు, పోస్టర్లు, ఫస్ట్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. అన్నీ రికార్డులు క్రియేట్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా సెకండ్ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇప్పటికే ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్, రష్మిక మందన్న మధ్య వచ్చే కపుల్ సాంగ్ ను రేపు అంటే మే 29వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నాడు. ఇక ఈపాటను స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడుతుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ ఇలా ఆరు భాషల్లో కూడా శ్రేయా ఘోషలే పాడుతుంది. ఇక ఇప్పుడు ఈ పాటకు సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ పై లేటెస్ట్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో అల్లు అర్జున్, రష్మిక లు రిహార్సల్స్ చేస్తున్నట్టు నార్మల్ కాస్ట్యూమ్ లలో కనిపిస్తుండడం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. జగపతిబాబు, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.