గం.గం.. గణేశా రివ్యూ 

Gam Gam Ganesha telugu review

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, నయన్ సారిక ,ప్రగతి శ్రీవాత్సవ,ఇమ్మాన్యుయేల్,వెన్నెల కిషోర్
ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ :ఆదిత్య జవ్వాడి
సంగీతం : చైతన్య భరద్వాజ్
దర్శకత్వం : ఉదయ్ బొమ్మిశెట్టి
నిర్మాతలు : వంశీ కారుమంచి,కేదార్ సెలగంశెట్టి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత ఏడాది బేబీ తో సెన్సేషనల్ హిట్ కొట్టాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.ఈ హీరో ఇప్పుడు గం.గం.. గణేశా అంటూ వచ్చాడు.ప్రమోషనల్ కంటెంట్ సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.మరి ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఎలా వుంది అంచనాలను అందుకుందా ? ఆనంద్ దేవరకొండకు మరో హిట్ ఇవ్వనుందో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ :

అనాథ అయిన గణేష్ (ఆనంద్ దేవరకొండ) తన స్నేహితుడు శంకర్( ఇమ్మాన్యుయేల్) తో కలిసి దొంగతనాలు చేస్తుంటాడు.ఈక్రమంలో శృతి ( నయన్ సారిక) తో లవ్ లో పడతాడు హీరో.అయితే కొన్ని రోజుల తరువాత గణేష్ ను మోసం చేసి ఆమె డబ్బు వున్న వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది.దాంతో గణేష్ డబ్బు బాగా సంపాదించాలనుకుంటాడు.ఇందుకోసం ఓ డైమండ్ ను దొంగతనం చేస్తాడు.పోలీసులు తనిఖీలు చేస్తుండడంతో ఆ డైమండ్ ను వినాయకుడి విగ్రహంలో దాస్తాడు.ఆ తరువాత గణేష్ లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది.ఈమధ్య లో గణేష్ లైఫ్ లోకి నీలవేణి (ప్రగతి శ్రీవాస్తవ ) ఎలా వచ్చింది? ఇంతకీ గణేష్ కు ఆ డైమండ్ దొరికిందా లేదా? అనేది మిగితా కథ.

విశ్లేషణ :

చిన్న చిన్న దొంగతనాలు చేసుకొనే హీరో ఓ పెద్ద డైమండ్ ను కొట్టేయడం అది కాస్త ఓ విగ్రహంలో పెట్టడం ఆ విగ్రహం చేరాల్సిన చోటికి కాకుండా వేరే చోటికి చేరడం.విలన్ గ్యాంగ్ కు కూడా ఆ విగ్రహం కావాల్సిరావడం దాంతో అటు హీరో గ్యాంగ్ ఇటు విలన్ గ్యాంగ్ విగ్రహం కోసం వెతకడం చివరికి ఇద్దరిలో ఎవరికి దక్కింది.కథా పరంగా చూస్తే ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసే సబ్జెక్టు ఇది.ఇక దాన్ని అంత ఇంట్రెస్టింగ్ గా తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు.

సినిమాను బాగేనా స్టార్ట్ చేసినా ఆతరువాత వచ్చే కొన్ని చోట్ల సీన్లు ఓవర్ ది టాప్ అనిపిస్తాయి.అయితే మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు ,సాంగ్స్ తో ఫస్ట్ హాఫ్ బాగానే అనిపిస్తుంది.ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ బాగుంది.దాంతో సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది.ఇక సెకండ్ హాఫ్ కు వచ్చే సరికి కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.కానీ మధ్యలో వెన్నల కిషోర్ ట్రాక్ రిలీఫ్ ఇస్తుంది.తన పాత్రను బాగా డిజైన్ చేశారు.మతి భ్రమించిన డాక్టర్ రోల్ లో హిలేరియస్ అనిపించాడు.క్లైమాక్స్ కూడా శాటిస్ఫై చేస్తుంది.ఓవరాల్ గా గం గం గణేశా ఓ మంచి టైం పాస్ ఎంటర్టైనర్.ఫస్ట్ హాఫ్ కామెడీ తో పర్వాలేదనిపించగా సెకండ్ హాఫ్ డీసెంట్ అనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఆనంద్ దేవరకొండ గణేష్ పాత్రలో మెప్పించాడు.లుక్స్ పరంగా కూడా ఆకట్టుకున్నాడు.యాక్టింగ్ కూడా బాగేనా చేశాడు.హీరోయిన్లు గా నటించిన నయన్ సారిక,ప్రగతి శ్రీవాత్సవ వారి రోల్స్ కు న్యాయం చేశారు.ఫ్రెండ్ పాత్రలో కనిపించిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కు మంచి రోల్ దొరికింది.ఇమ్మాన్యుయేల్,వెన్నెల కిషోర్ చాలా చోట్ల నవ్వించారు.మిగితా పాత్రల్లో నటించిన ప్రిన్స్ యావర్,కృష్ణ చైతన్య వారి పాత్రల్లో బాగేనా చేశారు.

టెక్నికల్ గా కూడా సినిమా ఓకే అనిపించింది.ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో మ్యాజిక్ చేశాడు డైరెక్టర్.ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా సినిమాను తెరకెక్కించాడు.చైతన్య భరద్వాజ్ సంగీతం బాగుంది.బీజీఎమ్ కూడా మెప్పించింది.సినిమాటోగ్రఫీ,ఎడిటింగ్ బాగానే కుదిరాయి.ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగ్గట్లు వున్నాయి.

ఓవరాల్ గా గం గం గణేశా లో ఆనంద్ దేవరకొండ నటన ,కామెడీ సన్నివేశాలు ,క్లైమాక్స్ హైలైట్ అయ్యాయి.ఓ మంచి టైం పాస్ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఈసినిమాను చూడొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.