భజే వాయు వేగం మూవీ తెలుగు రివ్యూ

bhaje vaayu vegam movie telugu review

కార్తికేయ హీరోగా ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా భజే వాయి వేగం. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి భజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయాలు తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. కార్తికేయ, ఐశ్వర్య మీనన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ, రాహుల్ టైసన్ తదితరులు
దర్శకత్వం.. ప్రశాంత్ రెడ్డి
సమర్పణ.. యూవీ క్రియేషన్స్
బ్యానర్స్.. యూవీ కాన్సెప్ట్స్
సంగీతం.. రధన్
సినిమాటోగ్రఫి.. ఆర్.డి రాజశేఖర్

కథ
పోలీస్ స్టేషన్ లో ఈ కథ మొదలవుతుంది. క్రికెటర్ గా ఉన్న కార్తికేయపై పలు కేసులు ఉంటాయి.
మరోవైపు విలన్ గ్యాంగ్స్ కి చెందిన ఒక బ్యాగ్ మిస్ అవుతుంది. ఫైనల్ గా అది కార్తికేయ వద్దకు చేరుతుంది. మరోవైపు హీరో తండ్రి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఉంటాడు. హీరో తన తండ్రిని ఎలా కాపాడుకోగలిగాడు ? విలన్స్ గ్యాంగ్ బ్యాగ్ కోసం హీరోని ఏం చేసారు అనేది ఈసినిమా కథ..

విశ్లేషణ
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని నటుడిగా తన మార్క్ ను చూపించాడు. అయితే ఆర్ఎక్స్ 100 తరువాత ఆ రేంజ్ హిట్ అనేది కార్తికేయకు దక్కలేదనే చెప్పాలి. అయినా కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు ఈసినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా తనకు మంచి కమ్ బ్యాక్ సినిమా అవుతుందన్న నమ్మకంతో ఉన్నాడు కార్తికేయ. మరి తన నమ్మకం నిజం అయిందనే అనిపిస్తుంది ఈసినిమాకు వస్తున్న టాక్ చూస్తుంటే..

ఫాదర్ సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈసినిమాలో కూడా ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. అయితే దానితో పాటు క్రికెట్ నేపథ్యం కూడా తీసుకొని మంచి కథాంశంతో వచ్చాడు ప్రశాంత్ రెడ్డి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ కాస్త రొటీన్ గా మొదలవుతుంది. ఆ తరువాత నాన్న సెంటి మెంట్, కార్తికేయ ఆట మొదలుపెట్టడం జరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సెకండ్ హాఫ్ పై మరింత అంచనాలను పెంచుతుంది. సెకండ్ హాఫ్ సినిమాకు మెయిన్ హైలెట్ అని చెప్పొచ్చు. ముందు నుండీ చెపుతున్నట్టే సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్ గా తీశాడు ప్రశాంత్ రెడ్డి. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.

పెర్ఫామెన్స్
ఈసినిమాలో కార్తికేయ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. చాలా కామన్ మ్యాన్ తరహా పాత్ర కాబట్టి అందుకు తగ్గట్టుగానే సెటిల్డ్ పెర్ఫామెన్స్ చేశాడు. హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య మీనన్ కూడా చాలా బాగుంది. తన పాత్రకు తగ్గట్టు నటించింది. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ, రాహుల్ టైసన్ తమ పాత్రల మేర బాగానే నటించారు.

టెక్నికల్ వాల్యూస్
ఇక సాంకేతకి విభాగానికి వస్తే.. ఈసినిమాకు రధన్ పాటలు అందించగా.. కార్తిక్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. పాటల సంగతి పక్కన పెడితే కార్తిక్ కుమార్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఆర్డీ రాజశేఖర్ అందించిన సినిమాటోగ్రఫి కూడా చాలా బాగుంది. సత్య ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. యూవీ నుండి వచ్చిన సినిమా కాబట్టి నిర్మాణ విలువలకు ఎలాంటి వంక పెట్టడానికి లేదు.

ఓవరాల్ గా చెప్పాలంటే కార్తికేయ భజేవాయి వేగం సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీకెండ్ కు వచ్చిన ఈసినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.