రివ్యూ : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

Gangs of Godavari telugu review

నటీనటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : అమిత్ మదడి
సంగీతం : యువన్ శంకర్ రాజా
దర్శకత్వం : కృష్ణ చైతన్య
నిర్మాతలు : నాగవంశీ, సాయి సౌజన్య

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎలక్షన్ హడావిడి, ఐపీఎల్ ఫీవర్ ముగియడంతో థియేటర్లలో చాలా రోజుల తరువాత సినిమాల సందడి మొదలైయింది. ఈ రోజు ఏకంగా మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకటి. విశ్వక్ సేన్ మాస్ రోల్ లో నటించడం అలాగే ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం వీటికి తోడు సాంగ్ చార్ట్ బస్టర్ కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : 
లంకల రత్న (విశ్వక్ సేన్) ఓ సాధారణ వ్యక్తి. జీవితంలో ఎదగడం కోసం లోకల్ ఎమ్మెల్యే గ్యాంగ్ లో చేరతాడు. అక్కడి నుండి పవర్ ఫుల్ లీడర్ గా ఎదుగుతాడు. ఈ క్రమంలో రత్నకు శత్రువులు ఎక్కువవుతారు. ఈ మధ్యలో రత్న, బుజ్జి (నేహా శెట్టి)తో ప్రేమలో పడడం తరువాత పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. మరో వైపు అంజలితో కూడా రత్నకు సంబధం ఉంటుంది. ఇంతకీ అంజలి ఎవరు? చివరికి రత్న తను అనుకున్నది సాధించాడా? అనేదే మిగితా కథ.

విశ్లేషణ : 

ఇదో రూరల్ బ్యాక్ డ్రాప్ గ్యాంగ్ స్టర్ డ్రామా. గోదావరి పరిసర ప్రాంతంలో 1980 లో జరిగే కథ. ఓ సాధారణ యువకుడు పవర్ ఫుల్ లీడర్ గా ఎలా ఎదిగాడు? ఆతరువాత అతని కథ ఏమైంది? ఇదే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అయితే దీన్ని ఎగేజింగ్ గా తెర మీదకు తీసుకరావడంలో డైరెక్టర్ కృష్ణ చైతన్య సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ లో రత్న, అంజలి ల పరిచయ సన్నివేశాలు ఆతరువాత రత్న, బుజ్జి లవ్ ట్రాక్ తో ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఒక సాంగ్, అలాగే ఫైట్ సీక్వెన్స్ ఫస్ట్ హాఫ్ లో హైలైట్ అయ్యాయి. ఇక కథ అంతా ఫస్ట్ హాఫ్ లో రివీల్ చేయడంతో సెకండ్ హాఫ్ లో పెద్దగా చెప్పడానికి ఏం లేకుండా పోయింది. అయితే సెకండ్ హాఫ్ ను స్క్రీన్ ప్లే తో ఇంట్రెస్టింగ్ గా మార్చాడు దర్శకుడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా కన్వీన్సింగ్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించగా సెకండ్ హాఫ్ డీసెంట్ అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే రత్న అనే పవర్ ఫుల్ లో కనిపించిన విశ్వక్ సేన్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. తనకున్న ఇమేజ్ రీత్యా రత్న పాత్ర కొంచెం వెయిట్ వున్న క్యారెక్టరే కానీ ఆ రోల్ ను విశ్వక్ చాలా బాగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టాడు. ఇక హీరోయిన్లు గా నటించిన నేహా శెట్టి, అంజలి తమ పాత్రలను సమర్ధవంతంగా పోషించారు. మిగితా కీలక పాత్రల్లో కనిపించిన నాజర్, సాయి కుమార్, గోపరాజు రమణ, హైపర్ ఆది పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. విజువల్స్ సజహంగా వున్నాయి. యువన్ రాజా  సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. సాదాసీదా సన్నివేశాలను కూడా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ ఓకే. సితార నిర్మాణ విలువలు అదిరిపోయాయి. ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారు.

ఓవరాల్ గా రూరల్ గ్యాంగ్ స్టర్ డ్రామా గా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లో విశ్వక్ నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫస్ట్ హాఫ్ హైలైట్ అయ్యాయి. మాస్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నచ్చుతుంది. మిగితా వారు కూడా ఓ సారి చూసేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.