సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంలో ఎంతోమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మహేష్ బాబు, సుధీర్ బాబు ఎవరి కెరీర్ లో వారు దూసుకుపోతున్నారు. ఇక వారి తరువాత సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో అశోక్ గల్లా. హీరో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అశోక్ మొదటి సినిమాతో మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా వస్తున్న సినిమా దేవకీ నందన వాసుదేవ. ప్రస్తుతం సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఏమయ్యిందే అంటూ వచ్చిన ఈపాట మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు చిత్రయూనిట్. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా జై బోలో కృష్ణ అనే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. మే 30 వ తేదీన పాట ప్రోమోను అలానే మే31వ తేదీన ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.
Celebrate Super🌟 #Krishna garu’s birth anniversary with #DevakiNandanaVasudeva 2nd single #JaiBoloKrishna 💥
Promo on May 30th,
Full song on May 31st 🎶@AshokGalla_ @varanasi_manasa @ArjunJandyala @PrasanthVarma @DevdattaGNage @getupsrinu3 #RasoolEllore #BheemsCeciroleo pic.twitter.com/nKSa59OMcd— Sri Lalithambika Productions (@lalithambikaoff) May 28, 2024
కాగా ఈసినిమాలో మానస హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్ వర్మ కథను అందిస్తున్నాడు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























