ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంధాదున్’ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా చేసిన ఆయుష్మాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా రీమేక్ తెరకెక్కనుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్ నికిత రెడ్డిలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ జూన్ నుండి మొదలుకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో శివగామి అదే రమ్యకృష్ణ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. హిందీలో ఈ సినిమా అంతటి విజయం సాధించడానికి గల ప్రధాన కారణాల్లో టబు చేసిన నెగెటివ్ రోల్ అని కూడా చెప్పొచ్చు. ఈ సినిమాకు టబు పాత్ర కూడా కీలకం. టబు నటన సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక తెలుగు అంధాదున్ లో టబు పాత్రలో రమ్యకృష్ణను అనుకుంటున్నారట. అయితే రమ్యకృష్ణ మాత్రం ఈ పాత్ర కోసం భారీగానే డిమాండ్ చేస్తుందట. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదట. తెలిసిన సమాచారం ప్రకారం… కొంత మంది స్టార్ హీరోయిన్స్ తీసుకునేదానికంటే చాలా ఎక్కువని తెలుస్తోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అంధాదున్ లో టబు ది కొంచం బోల్డ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ లో రమ్యకృష్ణ నటించడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. మరి ఒకవేళ ఒప్పుకుంటే అంత రెమ్యూనరేషన్ కూడా ఇస్తారో లేదో కూడా చూడాలి. చూద్దాం మరి ఎం జరుగుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: