ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో సింహ, లెజెండ్ సినిమాలు రావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి చూద్దాం హ్యాట్రిక్ కొడతారేమో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా బాలయ్య -బి.గోపాల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్నట్టు గత కొన్ని నెలలుగా వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. తెలిసిందే. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ లాంటి బ్లాక్‌బస్టర్లను బాలయ్యకు అందించాడు బి. గోపాల్. అయితే ప్రస్తుతం ఈయన ఫామ్ లో లేడనుకోండి. కానీ బాలయ్య మాత్రం ఈ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చాడు. ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం… ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి ఫుల్ స్క్రిప్ట్ ను అందిస్తున్నారు. అయితే సాయి మాధవ్ స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఫుల్ యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా కథ ను రాసినట్టు తెలుస్తుంది. ఇక ఈ కథను బాలయ్యకు వినిపించడమే లేట్ అట. ఒకవేళ స్క్రిప్ట్ కనుక బాలయ్యకు నచ్చితే నవంబర్ నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో… బాలయ్యకు స్క్రిప్ట్ నచ్చుతుందో..?లేదో..?
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: