చాలా తక్కువ టైమ్ లోనే ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయ్ సినిమా కెరీర్ నే మార్చేసింది. అర్జున్ రెడ్డి తర్వాత కూడా విజయ్ మంచి హిట్స్ కొట్టడంతో ఇక తిరుగులేకుండా పోయింది. కేవలం ఒక్క తెలుగులోనే కాదు సౌత్ నుండి నార్త్ వరకు విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పొచ్చు. జాన్వీ కపూర్, అలియా భట్, కియారా అద్వానీ, రఖుల్ లాంటి వాళ్లు కూడా విజయ్ దేవరకొండ కు ఫిదా అయిపోయారంటేనే చెప్పొచ్చు అతనికి ఎంత క్రేజ్ ఉందో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక విజయ్ కు వున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని కరణ్ జోహార్ ఎప్పటినుండో తనతో సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. నిజానికి డియర్ కామ్రేడ్ సినిమాను అనుకున్నారు కానీ అది వర్క్ అవుట్ కాలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ హీరోగా మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వింటూనే వున్నాం. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసమే విజయ్ కు భారీగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండకి ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..రూ.48 కోట్లు విజయ్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా బిజీలో వున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ గా కనిపించనున్నాడట. వీటితో పాటు దిల్ రాజు ప్రొడక్షన్ లో శివ నిర్వాణ దర్శకత్వంలో మరో కొత్త సినిమాను చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: